సెంచరీతో చెలరేగిన బ్రూక్
ఈ సీజన్ IPL మ్యాచ్‌లు క్రమక్రమంగా చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జట్టులన్నీ IPL ట్రోఫీని ద్కకించుకునేందుకు హోరాహోరీగా తలపడుతున్నాయి. నిన్న జరిగిన SRH Vs KKR టీమ్‌లో ఎవరు ఉహించని విధంగా SRH ఆటగాళ్లు చెలరేగిపోయారు. కాగా నిన్నటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ క్రికెటర్ బ్రూక్ సెంచరీతో అదరగొట్టడంతో..KKR పై SRH పైచేయి సాధించింది. దీంతో బ్రూక్ SRH పాలిట హీరోగా మారాడు. అయితే ఈ హీరోని SRH రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ IPL సీజన్ తొలి మ్యాచుల్లో బ్రూక్ కేవలం 13,3,13 పరుగులు చేసి ఆటలో పేలవమైన ప్రధర్శన కనబరిచాడు. దీంతో SRH 13 కోట్లు పెట్టి కొన్నందుకు 13 పరుగులు చేశాడని నెటిజన్లు బ్రూక్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే నిన్నటి ఆటలో బ్రూక్ సెంచరీ చేయడంతో ప్రస్తుతం వారంతా రూ.13 కోట్లకు న్యాయం చేశాడని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన బ్రూక్ తనపై వచ్చిన ట్రోల్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నాని తెలిపారు. కాగా ఇప్పుడు సెంచరీతో ట్రోలర్స్ నోళ్లు మూయించినందుకు చాలా సంతోషంగా ఉందని బ్రూక్ ఆనందం వ్యక్తం చేశారు.

