భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘బ్రో’..ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన మల్టిస్టారర్ చిత్రం ‘బ్రో’ భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ రావడంతో జోరుగా వసూళ్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజే 48.09 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిందని సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి. కేవలం ఆంధ్ర, తెలంగాణలలోనే 35.50 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తో థియేటర్లు నిండిపోతున్నాయి. మరో రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని చిత్రబృందం సంబర పడుతున్నారు. ఈ చిత్రంలో పవన్ ‘కాలం’ అనే భగవంతుని పాత్రలో నటించగా, సాయిధరమ్ తేజ్ ‘మార్కండేయ’ అనే వ్యక్తి పాత్రలో నటించారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని దర్శకత్వం వహించగా, ప్రముఖ దర్శకుడు, మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. సంగీత దర్శకుడు తమన్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

