International

బ్రిటన్ కొత్త కేబినెట్‌లో కీలక పదవులు వారికే

బ్రిటన్ నూతన కేబినేట్‌లో ఓ అద్భుతం జరిగింది.  బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ గతంలో ఎన్నడూ లేని విధంగా కీలకమైన శాఖలను మైనార్టీ వర్గాలకే కేటాయించారు. తొలిసారిగా విభిన్నమైన కేబినేట్ ప్రకటించిన లిజ్ తొలి కేబినేట్ సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో శ్వేత జాతీయులు కీలక హోదాలో లేని బ్రిటన్ కేబినెట్ ఏర్పాటు చేయబడినట్లయ్యింది. ట్రస్ మంత్రి వర్గంలో భారత సంతతికి చెందిన సుయెళ్లా బ్రవర్మన్‌కు హోంమంత్రిగా అవకాశం దక్కింది. ఆగ్రాలో పుట్టిన మరొక భారత సంతతికి చెందిన అలోక్ శర్మకు కూడా చోటు లభించింది. భారత్, శ్రీలంక మూలాలున్న రణిల్ జయవర్దనాకు కూడా పర్యావరణ మంత్రిగా స్థానం దక్కింది. ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడిన రిషి సునాక్‌కు కానీ, అతని మద్దతుగా నిలిచిన మాజీమంత్రులకు కానీ ట్రస్ కేబినెట్‌లో చోటు దక్కలేదు. ట్రస్ మంత్రివర్గంలో ఉండనని రిషి ముందుగానే ప్రకటించారు.