Andhra PradeshNewsPoliticsSpiritual

బ్రహ్మశ్రీ చాగంటికి ఏపీ ప్రభుత్వ కీలక పదవి

ఏపీలో ప్రభుత్వం నామినేటెడ్ పదవులను ప్రకటించింది. వారిలో ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుని నైతిక విలువల సలహాదారుగా నియమించింది. ఆయన తన ప్రవచనాల ద్వారా సనాతన ధర్మాన్ని, భక్తిని యువతలో, విద్యార్థులలో పెంపొందిస్తున్నారు.

మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా మహ్మద్ షరీఫ్, కళింగ ఛైర్మన్‌గా రోణంకి కృష్ణం నాయుడు, గవర ఛైర్మన్‌గా మాల సురేంద్ర, శెట్టి బలిజ-కుడిపుడి సత్తిబాబు, కొప్పుల వెలమ-పీవీజీ కుమార్, తూర్పు కాపు- యశస్వి, కురుబ కురుమ-దేవేంద్రప్ప, రజక- సావిత్రి, వాల్మీకి -సుశీలమ్మ తదితరులను నియమించారు.