పోలీస్ స్టేషన్‌లో బాలుడి వింత ఫిర్యాదు..
పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఒక బాలుడు వింత ఫిర్యాదు చేశాడు. అది విన్న పోలీసులకు నవ్వాగలేదు. కంగ్టి పోలీస్ స్టేషన్‌లో తాను జాతరలో కొన్న హెలికాఫ్టర్ ఎగరడం లేదని షాప్ ఓనర్‌పై కంప్లైంట్ చేయడానికొచ్చాడు బాలుడు వినారెడ్డి. మూడు సార్లు కలర్స్ ఎక్సేంజ్ చేశానని, రూ.300 పెట్టి కొన్నానని పోలీసులకు ఏడుపు గొంతుతో చెప్పుకున్నాడు. మూడు సార్లు తెచ్చిన హెలికాఫ్టర్ బొమ్మ ఎగరలేదని, షాప్‌లో ఎగిరినట్లు చూపించారని పేర్కొన్నాడు. దీనితో పోలీసులు నవ్వుకున్నారు.

