NationalNewsTelangana

నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా-సీఎం కేసీఆర్

Share with

నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్రం పట్టించుకోవడం లేదంటూ విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నానన్నారు. కేంద్రం తీరును నిరసస్తూ మోదీకి లేఖ రాశానన్నారు. ప్లానింగ్ కమిషన్‌తో దేశం అభివృద్ధి చెందిందని.. కానీ నీతి ఆయోగ్‌తో అలా జరగడం లేదన్నారు. గతంలో ప్రధానులు మంచి చెప్తే వినేవారని కానీ ఇప్పుడు అలా లేదన్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా అంటూ తీసుకొచ్చిన నీతి ఆయోగ్ వల్ల ఒరిగిందేముందన్నారు. దేశాన్ని బాగు చేస్తారనుకుంటే అలా జరగలేదన్నారు. నీతి ఆయోగ్ కమిటీలో ముఖ్యమంత్రులకు సభ్యత్వం ఇవ్వడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుందని భావించామన్నారు. అందరూ కలిసికట్టుగా టీమ్ ఇండియాగా పనిచేస్తామని మోదీ పిలుపునిస్తే… అందుకు విరుద్ధంగా పరిణామాలు జరిగాయన్నారు. దేశానికి మంచి రోజులు వస్తాయనుకుంటే… దేశం ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. ప్లానింగ్ కమిషన్ రాష్ట్రాల బడ్జెట్ రూపకల్పనలో సహకరించేవి… కానీ నీతి ఆయోగ్‌… నేతి బీరకాయ చందంలా మారిందన్నారు. కొండ నాలుక్కి మందస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా ఉందన్నారు. నీతి ఆయోగ్ ఎనిమిదేళ్ల తర్వాత ఆచరణ పెద్ద జోక్‌గా మారిపోయిందన్నారు. దేశంలో దురవస్థలు రాజ్యమేలుతున్నాయని… విధ్వంసం, అసహనం ఎక్కువైపోయిందన్నారు. దేశం నుంచి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయన్నారు.