60 వేల మందితో మల్లన్న బోనాలు
తెలంగాణలోని జగిత్యాల జిల్లా పెద్దాపూర్‌లో రెండో అతిపెద్ద మల్లన్న బోనాల జాతరగా ఈ ఉత్సవానికి పేరు ఉంది. కాముడి పౌర్ణమి మొదటి ఆదివారం నిర్వహించే బోనాల జాతరకు లక్షల్లో భక్తులు తరలివచ్చారు. ఆదివారం సాయంత్రం ఒకేసారి దాదాపు 60 వేల మందికిపైగా మహిళలు బోనాలు తీసుకొచ్చి, స్వామి వారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.


 
							 
							