Breaking NewsHome Page Sliderhome page slidermovies

“బొమ్మ హిట్”  ప్రారంభం

చైల్డ్ ఆర్టిస్టుగా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అభినవ్ మణికంఠ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “బొమ్మ హిట్”.  ఈ చిత్రాన్ని అంజనీపుత్ర ఫిలింస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1గా  గుర్రాల‌‌‌ సంధ్యారాణి నిర్మిస్తున్నారు. బొమ్మ హిట్ చిత్రంతో రాజేష్ గడ్డం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పూజా యడం హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో  హైదరా బాద్ లో ప్రారంభమైంది. అనంతరం మూవీ హైలైట్స్ ను ఈ రోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్ర బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో.. హీరో అభినవ్ మణికంఠ మాట్లాడుతూ – ఇది హీరోగా నాకు రెండో సినిమా. ఫస్ట్ ఫిలిం వర్క్స్ జరుగుతున్నాయి. నేను నటించిన ర్యాంబో ఇన్ లవ్ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. బొమ్మ హిట్ సినిమా మంచి ఎంటర్ టైన్ మెంట్ తో సిచ్యువేషనల్ కామెడీతో వినోదాన్ని ఇస్తుంది. ఈ చిత్రంలో ఫన్ తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంది. ఈ మధ్య ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మా బొమ్మ హిట్ సినిమాను కూడా హిట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు. డైరెక్టర్ రాజేష్ గడ్డం మాట్లాడుతూ – బొమ్మ హిట్ మూవీతో నేను దర్శకుడిగా టాలీవుడ్ లోకి వస్తుండటం సంతోషంగా ఉంది. మా ప్రొడ్యూసర్స్ సంధ్యరాణి గారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. నేను కొత్త దర్శకుడిని అని అనిపించడం లేదు. బొమ్మ హిట్ సినిమా ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి మెసేజ్ తో ఉంటుంది. ప్యాడింగ్ ఆర్టిస్టులు మా మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే సమ్మర్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అన్నారు. నిర్మాత గుర్రాల సంధ్యారాణి మాట్లాడుతూ – మా అంజనీపుత్ర ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా బొమ్మహిట్ సినిమాను నిర్మిస్తున్నాం. దర్శకుడు రాజేష్ మంచి కథ చెప్పాడు. బలమైన ఈ కథను బాగా తెరకెక్కిస్తే తప్పకుండా హిట్ మూవీ అవుతుంది. ఇందులో హీరో హీరోయిన్స్ ప్రేమ కథతో పాటు తల్లిదండ్రులు, కొడుకు మధ్య ఉండే అనుబంధం ఆకట్టుకుంటుంది. టెక్నీషియన్స్, ఆర్టిస్టుల సపోర్ట్ తో సక్సెస్ పుల్ గా మూవీని కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తాం. బొమ్మ హిట్ సినిమాను హిట్ చేసి మరోసారి మీ ముందుకు వస్తాం. అన్నారు. నటుడు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ – బొమ్మ హిట్ చిత్రంలో నేను హీరో తండ్రి పాత్రలో నటిస్తున్నాను. మంచి కథా కథనాలతో పాటు, వినోదం, పాటలతో ఈ సినిమా రూపొందుతోంది.  అంజనీపుత్ర బ్యానర్ లో తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న బొమ్మ హిట్ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. అన్నారు. హీరోయిన్ పూజా యడం మాట్లాడుతూ – ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఇంకా నా క్యారెక్టర్ మూవీలో ఎంటర్ కాలేదు. ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది. అన్నారు. నటుడు హైపర్ ఆది మాట్లాడుతూ  – అభినవ్ చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేశాడు. ఇప్పుడు హీరోగా మన ముందుకు వస్తున్నాడు. మా ప్రొడ్యూసర్స్ తెలివిగా బొమ్మ హిట్ అని టైటిల్ పెట్టారు. ఇక మీకు తప్పదు ఖచ్చితంగా సినిమా హిట్ చేయాల్సిందే. మీరు రివ్యూస్ రాసినా బొమ్మ హిట్ అని టైటిల్ ఉంది కాబట్టి ప్రేక్షకులు హిట్ అనే అనుకుంటారు. బలమైన కథతో వస్తున్న ఈ సినిమా పేరుకు తగినట్లే హిట్ కావాలి. అన్నారు. నటుడు జబర్దస్త్ అవినాశ్ మాట్లాడుతూ – బొమ్మ హిట్ మూవీలో నటించడం  హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్ గారితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. సినిమా టైటిల్ లాగే పెద్ద హిట్ కావాలి. అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు.