Home Page SliderNationalNews Alert

మధ్యప్రదేశ్‌ యూనివర్సిటీపై బాంబు దాడి..

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌పూర్‌ ప్రభుత్వ యూనివర్సిటీ క్యాంపస్‌పై బాంబు దాడి జరిగింది. ముసుగు ధరించి గుర్తు తెలియని వ్యక్తి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం గేటు వద్దకు వచ్చి వరుసగా రెండు నాటు బాంబులు విసిరాడు. అనంతరం దుండగుడు బైక్‌పై పరారయ్యాడు. దీంతో ఆ ప్రాంతంలో పొగ కమ్ముకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ప్రాంతంలో పేలని రెండు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీస్‌ అధికారి రమేశ్‌ కౌరవ్‌ చెప్పారు. బుధవారం జరిగిన ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.