స్పృహలోకి వచ్చిన బాలీవుడ్ కామెడియన్
ఎట్టకేలకు బాలీవుడ్ హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ్ స్పృహలోకి వచ్చారు. ఈ విషయాన్ని వ్యక్తిగత కార్యదర్శి గర్విత్ నారంగ్ ప్రకటించారు. గత 15 రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 58 ఏళ్ల రాజు శ్రీవాస్తవ్ తీవ్ర గుండెపోటుతో ఈ నెల 10న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి వైద్యులు ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి మెరుగుపడుతోందని, వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు నారంగ్ తెలిపారు. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న సమయంలో కుప్పకూలిపోయిన శ్రీవాస్తవ్‌ను… వెంటనే ఎయిమ్స్‌లో చేర్పించారు. దీంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. శ్రీవాస్తవ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ పోస్ట్‌లు పెట్టారు.

