Home Page SliderNational

మెగాడీల్: మేఘాలయలో ప్రభుత్వంలో బీజేపీ

మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా రాష్ట్ర ఎన్నికలలో తన నేషనల్ పీపుల్స్ పార్టీకి (ఎన్‌పిపి) మెజారిటీ తక్కువగా ఉన్నందున మరో పర్యాయం సాధించడంలో సహాయం కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడారు. తప్పకుండా మద్దతిస్తామని అమిత్ షా, కాన్రాడ్ సంగ్మాకు భరోసా ఇచ్చారు. సంగ్మా పార్టీ 26 స్థానాల్లో విజయం సాధించనుంది. ఇప్పటికే 22 స్థానాల్లో విజయం సాధించగా.. మరో నాలుగింటిలో ఆధిక్యంలో ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అసెంబ్లీలో 60 స్థానాలు ఉన్న మేఘాలయలో మెజారిటీ మార్క్ 31. ఒక స్థానానికి సంబంధించిన ఓటింగ్ రద్దు చేయబడింది.

ఇక మేఘాలయలో బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. తృణముల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు ఐదేసి స్థానాల్లో విజయం సాధించాయి. ఇక యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యుడిపి) 11 సీట్లు గెలుచుకుని రెండో స్థానంలో ఉంది. ఈశాన్య ప్రాంతంలో బీజేపీ ప్రధాన ట్రబుల్ షూటర్ అయిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, సంగ్మాకు మద్దతు ఇవ్వాలని పార్టీ నిర్ణయాన్ని ప్రకటించారు.

అయితే, మ్యాజిక్ నంబర్‌ను దాటేందుకు కూటమి ఇంకా కొన్ని సీట్లు అవసరం కానున్నాయి. ఎన్నికలకు ముందు కాన్రాడ్ సంగ్మా, బీజేపీ మధ్య పొత్తు రద్దయ్యింది. మేఘాలయలో హంగ్ అసెంబ్లీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా తర్వాత సంగ్మా, అసోం సీఎం హిమంత బిస్వా శర్మతో గౌహతిలో సమావేశమయ్యారు. 2018లో రాష్ట్రంలో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుపొందిన బీజేపీ ఆరు సీట్లు గెలుచుకొంది. 2018లో బీజేపీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకున్నప్పటికీ ఎన్‌పీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. సంగ్మా పార్టీపై అవినీతి ఆరోపణలతో విభేదాలు రావడంతో ఈసారి రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి.