కేజ్రీవాల్ నివాసం ముందు బీజేపీ బైఠాయింపు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆయన ఇంటిముందు బైఠాయించారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. సీఎం అధికారిక నివాసం సుందరీకరణ పనులకు 45 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. బారికేడ్లు దాటుకుని ఇంటి ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో కొందరు మహిళా కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీనితో వారిని అరెస్టు చేసి అక్కడి నుండి తొలగించారు. కొవిడ్ సమయంలో సుందరీకరణకు ఇంతఖర్చా అంటూ ఎద్దేవా చేస్తున్నారు బీజేపీ శ్రేణులు.