NewsTelangana

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సైడ్ లైట్స్…

Share with

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా బీజేపీ సమావేశాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకొంది. తెలంగాణలో రోజు రోజుకు ప్రబలశక్తిగా ఎదుగుతున్న బీజేపీ… అందుకు సర్వసన్నద్ధమవ్వాలన్న యోచనలో ఉంది. కార్యవర్గసమావేశాల్లో వేదికపై ముగ్గురే ముగ్గురు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధాని నేరంద్ర మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాత్రమే వేదికపై ఉండబోతున్నట్టు సమాచారం. ఇక బీజేపీ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు ఏపీ, తెలంగాణ నుంచి అనేక మంది నాయకులు ఆహ్వానాలు అందుకున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యిందన్నారు బీజేపీ తెలంగాణ వ్యవహారాల బాధ్యులు తరుణ్ చుగ్. కేసీఆర్ సంగతి త్వరలోనే పార్టీ తేల్చుతుందన్నారు బండి సంజయ్.