Breaking Newshome page sliderHome Page SliderNational

రేణుకా చౌదరి వ్యాఖ్యలపై బీజేపీ MPs ఆగ్రహం

పార్లమెంటు సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరిపై బీజేపీ ఎంపీలు కఠినంగా స్పందించారు. బీజేపీ ఎంపీలు బ్రిజ్‌లాల్, గోపాలస్వామి రేణుకా చౌదరిపై రాజ్యసభ ఛైర్మన్‌కు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను ఛైర్మన్ ప్రివిలేజ్ కమిటీకి పంపించారు.

ఇటీవల రేణుకా చౌదరి పార్లమెంటు భవనంలోకి తన పెంపుడు కుక్కను తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై ఆమె పరోక్షంగా ఎన్డీఏ సభ్యులను లక్ష్యంగా చేసుకుంటూ “కరిచేవాళ్లు లోపల ఉన్నారు” అంటూ వ్యాఖ్య చేసినట్టు ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా బీజేపీ శాసనసభ్యుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ వివాదంపై ప్రివిలేజ్ కమిటీ దర్యాప్తు చేపట్టనుంది.