ఐదో రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యత
మునుగోడు ఉప ఎన్నికలో ఐదో రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ ధిక్యత సాధించింది. ఈ రౌండ్‌లో సంస్థాన్ నారాయణపూర్ ఓట్లు లెక్కించారు. ఐదో రౌండ్ పూర్తయిన తర్వాత టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 1430 ఓట్ల ఆధిక్యం లభించింది. ఐదో రౌండ్ తర్వాత కూసుకుంట్లకు 32,405 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 30,975 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 10055 ఓట్లు పడ్డాయి. ప్రతి రౌండ్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ హోరాహోరీ పోరాడుతున్నాయి. రౌండ్ రౌండ్‌కు ముందంజలు మారుతున్నాయి. రోటీ మేకర్, రోడ్ రోలర్ గుర్తులు టీఆర్‌ఎస్‌కు చుక్కలు చూపిస్తున్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి కేఏ పాల్‌కు 34 ఓట్లు వచ్చాయి. రోటీ మేకర్‌కు 104 ఓట్లు, బీఎస్పీకి 1237, నోటాకు 142, గాలయ్యకు 127, రోడ్ రోలర్‌కు 84 ఓట్లు పోలయ్యాయి. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంచార్జిగా ఉన్న దేవులపల్లిలో బీజేపీ ఆధిక్యత సాధించింది.

