ఈడీకి బీజేపీ ఫిర్యాదు
టీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారంపై తెలంగాణ బీజేపీ ఈడీకి ఫిర్యాదు చేసింది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈడీ ఆఫీస్కు వెళ్లారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోపై ఆయన ఈడీకి ఫిర్యాదు చేశారు. నిజానిజాలు తేలాలని ఈడీని కోరారు. మరోవైపు ఈ కేసుతో తమకు సంబంధం లేదంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే యాదగిరిగుట్టలో ప్రమాణం చేశారు. సవాల్ ప్రకారం తాను ప్రమాణం చేశానని, ఇంతవరకు కేసీఆర్ ఎందుకు రాలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.

