మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న బీజేపీ హవా
ఈ రోజు తెలంగాణాతో పాటు మధ్య ప్రదేశ్,రాజస్థాన్,ఛత్తీస్ ఘడ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్స్ ప్రారంభ మయ్యాయి. కాగా తెలంగాణాలో ఇప్పటికే మొదటి రౌండ్ ముగిసింది. ఈ రౌండ్‌లో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ను వెనక్కి నెట్టి కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. ఈ రౌండ్‌లో బీజేపీ పార్టీ కేవలం 5 స్థానాల్లో ముందంజలో ఉంది. అయితే మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ పార్టీ జోరు కన్పిస్తోంది.కాగా ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ పార్టీ 92,కాంగ్రెస్ 75,ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.దీని ప్రకారం ఏ పార్టీ అయినా మెజార్టీ సాధించాలంటే 116 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.అయితే బీజేపీ పార్టీ మెజార్టీ కంటే ఎక్కువగా 127 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. కాగా ఇటీవల వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో కూడా మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని సర్వేలు వెల్లడించిన విషయం తెలిసిందే.

