Home Page SliderTelangana

జమిలి ఎన్నికల ముసుగులో బీజేపీ కుట్ర..రేవంత్ రెడ్డి

జమిలి ఎన్నికలపై బీజేపీ పార్టీ ఆమోదముద్ర వేయడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దీనిలో బీజేపీ పార్టీ కుట్రకోణం దాగి ఉందని ఆరోపించారు. హైదరాబాద్‌లో జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో సీఎం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సీతారాం ఏచూరిని కోల్పోవడం దేశానికి, సమాజానికి తీరని లోటు. బీజేపీ కుట్ర చేసి జమిలి ఎన్నికల పేరుతో రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోంది. దేశాన్ని కబళించాలని ప్రయత్నిస్తోంది. సీతారాం ఏచూరి స్ఫూర్తితో జమిలి ఎన్నికలపై మనందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి. ఇలాంటి కీలక సమయంలో ఆయన లేకపోవడం సమాజానికి తీరని నష్టం అని వ్యాఖ్యానించారు. ఏచూరి నిర్థేశించిన పోరుబాటలో విపక్షాలన్నీ కలిసికట్టుగా ఈ జమిలి ఎన్నికలపై పోరాడాలని పిలుపునిచ్చారు.