అసత్య వార్తకు బీజేపీ ఖండన
`సాలు దొర – సెలవు దొర` ప్రకటనలపై అసత్య వార్తను ప్రచారం చేయడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండించింది. దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించిందనడంలో వాస్తవం లేదన్నారు బీజేపీ నాయకురాలు రాణి రుద్రమా దేవి. అనుమతి కోరినప్పుడే కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరిస్తుంది కదా.. అని ఆమె ప్రశ్నించారు. ఇదంతా అసత్య ప్రచారమని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ సీఈవో స్వయంగా చెప్పారన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ వైఖరిని ప్రజలు గమనించాలని కోరారు. `సాలు దొర – సెలవు దొర` అనే ప్రచారాన్ని ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద మళ్లీ డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసి తీరుతామన్నారు. టీఆర్ఎస్ అసత్య ప్రచారాన్ని ఆర్టీఐ ద్వారా బట్టబయలు చేస్తామని రుద్రమదేవి తెలిపారు.