అమ్మకానికి బిస్లరీ సిద్ధం… ధర ఎంతో తెలుసా!?
భారతీయ ప్యాకేజ్డ్ వాటర్ వ్యాపారానికి 82 ఏళ్ల మార్గదర్శకుడు, రమేష్ చౌహాన్ 1969లో కంపెనీని ప్రారంభించారు. బిస్లరీ ప్యాకేజ్డ్ వాటర్ సెగ్మెంట్లో కోకా-కోలా కంపెనీకి సంబంధించిన కిన్లీ, పెప్సికో ఇంక్ సంబంధించిన ఆక్వాఫినాతో పోటీపడుతుంది. ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ బిస్లరీ ఇంటర్నేషనల్ టాటా గ్రూప్‌కు విక్రయించేందుకు చర్చలు జరుపుతున్నట్లు పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. కంపెనీ చైర్పర్సన్ రమేష్ చౌహాన్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (TCPL)తో ₹7,000 కోట్ల డీల్ పూర్తయిందన్న వార్తలను ఖండించారు. అయినప్పటికీ, బిస్లరీని విక్రయించాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు. 82 ఏళ్ల భారతీయ ప్యాకేజ్డ్ వాటర్ వ్యాపారానికి రమేష్ చౌహాన్ మార్గదర్శకుడు. 1969లో కంపెనీని ప్రారంభించి ఎన్నో సంచలనాలు నమోదు చేశారు.

తన వ్యాపారాన్ని నిర్వహించగల సత్తా ఉన్న వారసుడు లేకపోవడంతో కంపెనీని విక్రయించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. బిస్లరీ వ్యాపారాన్ని ఎందుకు విక్రయిస్తున్నాడని ఆరా తీస్తే, ఆక్టోజెనేరియన్ వ్యాపార నాయకుడు ఎవరైనా దానిని నిర్వహించడం బెటరని చెప్పాడు. కుమార్తె జయంతికి వ్యాపారాన్ని నిర్వహించడానికి ఆసక్తి లేదని చౌహాన్ PTI కి చెప్పారు. గతంలో థమ్స్అప్, గోల్డ్ స్పాట్, సిట్రా, మాజా, లిమ్కాతో సహా దేశీయ శీతల పానీయాల బ్రాండ్లతో చౌహాన్ ప్రజాదరణ పొందారు. భారీ మొత్తానికి తన బ్రాండ్లన్నింటినీ 1993లో కోకాకోలాకు అమ్మేశాడు.

ఈ బ్రాండ్లలో, థమ్స్ అప్ ఇప్పటికే బిలియన్-డాలర్ బ్రాండ్‌గా మారింది. కోకా-కోలా ఫ్రూట్ డ్రింక్స్ బ్రాండ్ మాజా కూడా 2024 నాటికి బిలియన్-డాలర్ బ్రాండ్‌గా మారుతుందని అంచనా ఉంది. చౌహాన్ 2016లో “బిస్లరీ POP”ని ప్రారంభించడం ద్వారా శీతల పానీయాల విభాగంలోకి మళ్లీ ప్రవేశించారు. కానీ నాటి ప్రజాదరణను పొందడంలో విఫలమయ్యారు. టాటా కన్స్యూమర్ సంస్థ… టాటా సాల్ట్, హిమాలయన్ మినరల్ వాటర్‌ను విక్రయిస్తున్నాయి. భారతదేశంలో స్టార్‌బక్స్‌తో కలిసి ఫుడ్ అండ్ బెవరేజెస్ చైన్ జాయింట్ వెంచర్‌ను నిర్వహిస్తోంది.

