NewsNews Alert

అభిమానులకు బర్త్‌ డే ట్రీట్‌

మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌. మెగాస్టార్‌ చిరంజీవి 67వ పుట్టిన రోజున అభిమానులకు ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. ఈనెల 22న చిరు బర్త్‌ డే. ఈ సందర్భంగా `గాడ్‌ ఫాదర్‌’ మూవీ నుంచి టీజర్‌ రిలీజ్‌ చేయనున్నారు.  ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా మూవీ మేకర్స్‌ తెలిపారు. తాజాగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ ఓ పోస్టర్‌ను కూడా షేర్‌ చేసింది. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన `లూసిఫర్‌’ రీమేక్‌గా రూపొందుతున్న ఈ మూవీకి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. థమన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి మరో విశేషం ఏమిటంటే… బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. నయనతార చిరంజీవికి చెల్లిగా నటిస్తోంది. పూరి జగన్నాథ్‌, సత్యదేవ్‌, సునీల్‌ తదితరులు అతిథి పాత్రల్లో మెప్పించనున్నారు. ఈ సినిమాను దసరాకు రిలీజ్‌ చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు.