నయనతార, నెట్‌ఫ్లిక్స్‌లకు భారీ షాక్..
నయనతార నటించిన నయనతార లైఫ్ డాక్యుమెంటరీపై కేసు విషయంలో నెట్‌ఫ్లిక్స్‌కు భారీ షాక్ తగిలింది. ఈ విషయంలో హీరో ధనుష్ కోర్టులో వేసిన దావాను సవాల్ చేస్తూ, నెట్‌ఫ్లిక్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ‘నయనతార -బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించిన ‘నానుమ్ రౌడీదాన్’ చిత్ర విజువల్స్‌ను వాడుకోవడంతో ఆయన నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. నెట్‌ఫ్లిక్స్‌కు, నయనతారకు నోటీసులు పంపించారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ నెట్‌ఫ్లిక్స్ పిటిషన్ వేసింది. నానుమ్ రౌడీదాన్ చిత్రంలో నటించిన నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను ప్రేమించి, పెద్దల అంగీకారంతో 2022లో వివాహం చేసుకున్నారు. వారి జీవితంలో ముఖ్యమైన ఈ సినిమా షూటింగ్‌లో మూడు సెకన్ల క్లిప్పింగ్స్‌ను వాడుకున్నారు. ఈ విషయంపై ధనుష్ లీగల్ నోటీస్ పంపించారు.

