Home Page SliderNational

గుజరాత్‌లో నరేంద్ర రికార్డును బద్దలు కొట్టిన భూపేంద్ర

భూపేంద్ర పటేల్ సీఎం పీఠం మరోసారి ఎలా అధిరోహించాడన్నదానిపై ఎంతో చర్చ జరుగుతోంది. అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని.. రెండోసారి సీఎం బాధ్యతలు చేపట్టిన పటేల్‌ను రాజకీయంగా నిలబెట్టిన పంచసూత్రాలను ఓసారి చూద్దాం.

అనూహ్యంగా సీఎం పదవి
పటేల్ గత ఏడాది సెప్టెంబర్‌లో ఆశ్చర్యకరమైన చర్యలో విజయ్ రూపానీని గుజరాత్ ముఖ్యమంత్రిగా మార్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ఎంపికగా ఆయన భావిస్తారు. కరోనా వేళ రూపానీ విఫలమవడంతో సీఎంగా భూపేంద్రపటేల్‌కు అవకాశం లభించింది. బీజేపీ ఎన్నికల లెక్కలు భూపేంద్ర పటేల్ నేతృత్వంలో గుజరాత్‌లో రికార్డు విజయాన్ని సాధించాయి.

బీజేపీకి దన్నుగా నిలిచిన పాటిదార్లు
రూపానీ స్థానంలో భూపేంద్ర పటేల్‌ను నియమించడంలో బీజేపీకి కలిసొచ్చింది. గుజరాత్‌లో రాజకీయంగా అత్యంత కీలకమైన గ్రూపులలో ఒకటైన పాటిదార్లు బీజేపీపై గుస్సాగా ఉన్నారు. తమ సామాజికవర్గం నుండి ముఖ్యమంత్రి కావాలని వారు డిమాండ్ చేస్తూవచ్చారు. పాటిదార్ ప్రాబల్యంగా ఉన్న స్థానాల్లో బీజేపీ అద్భుత పనితీరు కనబరిచింది.

గుజరాత్ చరిత్రలో రికార్డు విక్టరీ
పటేల్ నాయకత్వంలో బీజేపీ రికార్డు విజయం సాధించింది. మొత్తం 182 స్థానాల్లో 156 గెలుచుకోగా, అహ్మదాబాద్‌లోని ఘట్లోడియా స్థానం నుంచి పటేల్ స్వయంగా 1.92 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ, ”ఈసారి నరేంద్ర రికార్డును 2002లో 127 సీట్లు భూపేంద్ర బద్దలు కొడతారని ప్రచారంలో చెప్పానని గుర్తు చేశారు.

ఆర్ఎస్ఎస్‌తో సాన్నహిత్యం
పటేల్, వృత్తిరీత్యా బిల్డర్, BJP సైద్ధాంతిక గురువు RSSతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌కు అనుచరుడిగా గుర్తింపు పొందారు.

పార్టీలో ట్రబుల్ షూటర్
పటేల్, సాధారణంగా లో ప్రొఫైల్‌ మెయింటేన్ చేస్తారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో భాగంగా ఉన్నారు. బీజేపీలో ట్రబుల్ షూటర్‌గా, వ్యూహకర్తగా ఆయనకు పేరుంది.