NationalNews

భారత్ A జట్టులో తెలుగు యువ క్రికెటర్లు

ఈ ఏడాది ఐపిఎల్‌లో మెరిసిన తెలుగు కుర్రాళ్లలో తిలక్ వర్మ , కేఎస్ భరత్‌ న్యూజిలాండ్ ఎ జట్టుతో తలపడే భారత ఎ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. ఈ సీజన్ ఐపీఎల్‌లో (IPL ) ముంబై ఇండియన్స్ తరుపున ఆడిన  యువ క్రికెటర్ తిలక్ , అదేవిధంగా ఆంధ్ర వికెట్ కీపర్- బ్యాటర్ శ్రీకర్ భరత్‌కు సెలక్టర్‌లు అవకాశమిచ్చారు. వచ్చే నెల భారత్‌లో నాలుగు రోజుల చొప్పున మొత్తం మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి.     

 బెంగళూరు , హుబ్లీ వేదికగా ఈ మూడు మ్యాచ్‌ సిరిస్ జరుగుతుంది.ఈ ప్రక్రియలో భాగంగా ఇరువర్గాల మధ్య చెన్నైలో వన్డే సిరిస్ నిర్వ హిస్తారు. ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో తలపడే జట్టును మాత్రమే ప్రస్తుతం ఎంపిక చేస్తారు , వన్టే జట్టును తర్వాత ఎంపిక చేయనున్నట్టు సీనియర్ సెలక్షన్ కమిటీ వర్గాలు వెల్లడించాయి.