NewsTelangana

తప్పు చేశాడు కాబట్టే… కేసీఆర్‌ ఈడీకి భయపడుతున్నాడు

భయంలేని వాడివే అయితే పదే పదే సీబీఐ, ఈడీని ఎందుకు కలవరిస్తున్నావు… తప్పు చేసిన వాళ్లే భయపడతారు.. తప్పు చేశాడు కాబట్టే కేసీఆర్‌ భయపడుతున్నాడని బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. మనుగోడు బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. కేసీఆర్‌కు ప్రధాని మోదీ నీకు శత్రువు కావచ్చు.. కానీ దేశ ప్రజలందరికీ ఆయన నమ్మదగిన మిత్రుడు అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతి ఎన్నిక సమయంలో కేసీఆర్‌ బీబీసీని తీసుకొస్తాడు.. బ్రాండీ, బిర్యానీ, కరెన్సీని ఎరగా వేసి గెలిచి వెళ్లిపోతాడు. ఈసారికి లొంగొద్దు.. కేసీఆర్‌కు బుద్ధి చెప్పండి అని ఓటర్లను విజయశాంతి కోరారు. కేసీఆర్‌ను గద్దె దించడమే మా అందరి ఏకైక లక్ష్యమని విజయశాంతి స్పష్టం చేశారు.