Home Page SliderNational

ఫేక్ ఐటీ రిఫండ్‌ మెసేజ్‌లతో ‘బీ కేర్ ఫుల్’ …కేంద్రం హెచ్చరిక

మీకు ఐటీ రిఫండ్ వచ్చిందంటూ మెసేజ్ వచ్చిందా.. దీనితో పాటు మీ బ్యాంక్ ఖాతా సరిచేసుకోండంటూ మెసేజ్‌లు వస్తున్నాయా అయితే బీ కేర్ ఫుల్ అంటోంది కేంద్రప్రభుత్వం. ఐటీ రిఫండ్‌ల కోసం ఎదురుచూసే వారిని లక్ష్యంగా పెట్టుకుని, సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలు చేస్తున్నారు. ఇలా మెసేజ్‌లు పంపించి డబ్బు కాజేయాలని చూస్తున్నారు. ఐటీ శాఖ ఇలాంటి మెసేజ్‌లు పంపదని కేంద్రప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇలాంటి లింకులు ఓపెన్ చేస్తే , బ్యాంక్ ఎకౌంట్లు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. మీ వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడానికే ఇలా మెసేజ్‌లు పంపుతుంటారని, జాగ్రత్తగా ఉండమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వివరించింది. ఇలాంటి మెసేజ్ ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇలాంటి లింకులు ఓపెన్ చేయవద్దని, ఎలాంటి సమాచారాన్ని ఎంటర్ చేయవద్దని కేంద్రం సూచించింది.