Home Page SliderInternational

బంగ్లాదేశ్ బ్యాటింగ్ పూర్తి..టీమిండియా టార్గెట్ 257

సంచలనాల ప్రపంచకప్‌లో పూణెలో జరుగుతున్న భారత్ – బంగ్లాదేశ్‌ల మ్యాచ్‌ మంచి జోరుమీదుంది. 256 పరుగుల భారీ స్కోర్ బంగ్లా ఇన్నింగ్స్ పూర్తయ్యింది. టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది.  నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి 256 పరుగులు సాధించింది. ఓపెనర్లు తాంజిద్ హసన్(51), లిట్టన్ దాస్ (66) పరుగులతో రాణించారు. అనంతరం మిగిలిన బ్యాట్స్‌మన్ అంతగా ఆడలేకపోయినా చివర్లో వచ్చిన ముష్పీకర్ రహీమ్(38), మహ్మదుల్లా (46) పరుగులు సాధించడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. భారత్ బౌలర్లు రవీంద్రజడేజా 2, సిరాజ్ 2, బుమ్రా 2 వికెట్లు పడగొట్టగా, శార్ధూల్ ఠాకూర్, కులదీప్ యాదవ్ చెరో వికెట్ తీసారు. ఇప్పటికే మూడు వరుస విజయాలతో హ్యాట్రిక్ పూర్తి చేసిన భారత్ టీమ్‌ను గెలవడం కష్టమైనా.. బంగ్లాదేశ్‌ను కూడా తక్కువ అంచనా వేయకూడదని, జరుగబోయే ఇండియా బ్యాటింగ్‌లో పరుగుల వరద కొనసాగాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.