Home Page SliderTelangana

బీజేపీలోకి హరీష్ రావు‌కు వెల్కం పలికిన బండి సంజయ్

రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయి.. ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఊహించడం కష్టమే. రాజకీయాలు ఏ క్షణానైనా మారతాయ్. తాజాగా బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుకు బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆ పార్టీలోకి స్వాగతం పలకడం సంచలనంగా మారింది. హరీష్ ను నిజంగా పార్టీలోకి రావాలని బండి కోరుతున్నారా లేదంటే.. బద్నాం చేయడానికి కోరుతున్నారా అన్నదానిపై కన్ఫ్యూజన్ నెలకొంది.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపు బిజెపి దేనన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. లోక్ సభ ఎన్నికల్లో బిజెపి, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని… చేస్తున్న ఆరోపణలపై ఆయన పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో తాను కేసీఆర్ భాషలోనే చెప్తానంటూ సెటైర్లు వేశారు. మెడ మీద తలకాయ ఉన్నాడు, ఎవడో కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోరని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అసలు గెలిచే అవకాశం లేదని కుండబద్ధలుకొట్టారు. చాలామంది బీఆర్ఎస్ నేతలు, బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికే ఐదుగురు ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బిజెపితో పొత్తు పెట్టుకుంటామని, కేసీఆర్ పార్టీ నేతలకు అబద్దాలు చెబుతున్నారని వారందరూ పార్టీ మారకుండా డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు.

కెసిఆర్ పార్టీ నాయకులను కాపాడుకోవడం కోసం ఎంతకైనా దిగజారితాడని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రధాన నరేంద్ర మోడీ ఆ పార్టీని ఎన్డీఏలో చేర్చుకోలేదని ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావా అంటూ మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ఓడిపోతుందని దేశవ్యాప్తంగా బీజేపీ 400 స్థానాల్లో గెలుస్తుందని, తెలంగాణలో 17 స్థానాల్లో కూడా కాషాయ జెండా రెపరెపలాడుతుందని జోస్యం చెప్పారు సంజయ్. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ అవినీతిపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన, కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం మాట్లాడటం లేదని… ఎందుకు స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు.

కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారించడానికి అభ్యంతరం ఏముందని సంజయ్ విమర్శించారు. ప్రభుత్వం, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులపై సిబిఐ ఎంక్వైరీ కోరవచ్చని… ఎందుకు అలా చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో అవినీతిపరులను బిజెపిలోకి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వమని… మచ్చ లేని వాళ్ళని మాత్రమే పార్టీలోకి ఆహ్వానిస్తామని బండి సంజయ్ చెప్పారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు బిజెపిలో చేరతానంటే వెల్కమ్ పలుకుతామని చెప్పారు. అవినీతి వ్యతిరేకించే వాళ్లు, బిజెపి సిద్ధాంతాలు , మోడీ నాయకత్వంపై విశ్వాసం ఉన్న ఎవరినైనా సరే పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి వైపు రాముడు ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు రజకార్లు, మజ్లీస్ ఉన్నాయని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో రాముడిని, దేవుడిని నమ్మే వాళ్ళు బిజెపికే ఓటేస్తారని… రాముడు దేవుడిని నమ్మని వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని సంజయ్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు.