Home Page SliderNational

రూ.1000కే వెదురు డ్రోన్

వెదురు బొంగుతో రూ. వెయ్యిలోపే డ్రోన్ తయారు చేసి రికార్డు సృష్టించాడు బెంగళూరుకు చెందిన మెకానికల్ ఇంజినీర్, ప్రోడక్ట్ డిజైనర్ దీపక్ దధీచ్. ఆయన వినూత్నంగా ఆలోచించి తయారు చేసిన ఈ డ్రోన్ తయారీకి వెయ్యి రూపాయల లోపే ఖర్చయ్యిందట. స్క్రూలు, నట్లు తప్ప దీనిలో ఇతర భాగాలన్నీ చీల్చిన వెదురుతో తయారు చేశారు. ఇలాంటి పదార్థంలో రోబోటిక్ యంత్రాలను తయారు చేయడం ఇదే మొదటిసారి. దీని బరువు కేవలం 350 గ్రాములే. ఈ డ్రోన్ 500 మీటర్ల దూరం వరకూ పనిచేస్తుంది.