NationalNews

జాక్వెలిన్‌కు బెయిల్‌

200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఊరట లభించింది. ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకుగాను ఆమె 4 లక్షల రూపాయలు పర్సనల్‌ బాండ్‌పై బెయిల్‌ మంజూరు చేసింది. ఇప్పటికే ఈ కేసుపై ఛార్జ్‌షీట్‌ దాఖలైన నేపథ్యంలో కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని ఢిల్లీ కోర్టు పేర్కొంది.  కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని స్పష్టం చేసింది. జాక్వెలిన్‌ ఆరోపణలపై ఈ నెల 24న కోర్టులో వాదనలు కొనసాగనున్నాయి.

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌పై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి?

200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్‌ చంద్రశేఖర్‌కు జాక్వెలిన్‌ సన్నిహితురాలు. మోసం చేసిన డబ్బులతో ఖరీదైన బహుమతులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో జాక్విలిన్‌ను నిందితురాలిగా ఈ డీ పేర్కొంది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద జాక్వెలిన్‌ వాంగ్మూలాన్ని కూడా ఈడీ రికార్డు చేసింది. ఆ తర్వాత జాక్వెలిన్‌, సుఖేష్‌ల ఫోటోలు బయటపడ్డాయి. జాక్వెలిన్‌, సుఖేష్‌లు ఒకరికొకరు చాలా క్లోజ్‌గా ఉంటారని స్పష్టం చేశారు. సుకేష్‌కు చెందిన 200 కోట్ల దోపిడీ కేసులో జాక్వెలిన్‌ కీలక సాక్షి అని ఈడీ తెలిపింది.