NationalNews

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం -10 బోగీలు బోల్తా

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా కొరాయి రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు ప్లాట్‌ఫామ్ మీదకు దూసుకొని వచ్చింది. 10 బోగీలు బోల్తా పడ్డాయి. పలువురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. బోగీల కిందపడి ఇద్దరు మృతి చెందారు. ప్రయాణీకుల వెయిటింగ్ హాల్‌కు సమీపంలోకి రైలు బోగీలు రావడంతో మరికొంతమంది వాటికింద చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ మార్గంలోని రైళ్ల రాకపోకలు నిలిపివేసి, సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో రైల్వేస్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూడా కొంతభాగం కూలిపోయినట్లు తెలిసింది.