InternationalNews Alert

పాకిస్తాన్ బస్సులో 21 మంది సజీవదహనం

పాకిస్తాన్‌లోని కరాచీలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సుకు మంటలు అంటుకోవడంతో దాదాపు 21మంది సజీవదహనమయ్యారు. 10 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 12 మంది చిన్నారులు ఉన్నారు. నిన్న రాత్రి కరాచీకి సమీపంలోని M-9 మోటార్‌ వే వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ బస్సులో ప్రయాణికులంతా ఇటీవల పాక్‌ను ముంచెత్తిన వరద బాధితులు కావడం గమనార్హం.

విపత్తు సమయంలో వారికి మోటార్‌ వే సమీపంలో ఆశ్రయం కల్పించారు. తిరిగి వారంతా తమ స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారు. ఇంతలో ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ఉన్నారు. వెనక భాగంలో అంటుకున్న మంటలు వేగంగా వ్యాపించడంతో.. 21మంది సజీవదహనమయ్యారు. ఆ మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు బస్సు నుంచి బయటకు దూకేశారు . ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. అయితే ఘటనకు ఏసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు వెల్లడించారు.