NewsTelangana

దుండిగల్‌లో భీఫార్మసీ విద్యార్థిని అదృశ్యం

మేడ్చల్ దుండిగల్‌లో భీఫార్మసీ విద్యార్థిని అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. సెమిస్టర్ పరీక్ష కోసం దుండిగల్ వచ్చిన విద్యార్థిని హాఠాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా విద్యార్థిని ఆచూకీ  కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే విద్యార్థిని సిద్దిపేటకు చెందిన పూజితగా పోలీసులు వెల్లడించారు. సోమవారం నుంచి పూజిత ఆచూకీ తెలియక పోవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.