హేట్ స్పీచ్ కేసులో అజామ్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష
సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో యూపీలోని రాంపూర్ కోర్టు ఆయనను దోషిగా తేల్చుతూ… మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. 2019లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, అప్పటి కలెక్టర్ అంజనేయకుమార్ సింగ్‌పై ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే.. చీటింగ్ కేసులో జైలుకెళ్లిన ఆజంఖాన్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంతో ఈ ఏడాది జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఆయన దాదాపు రెండేళ్లపాటు జైలులో ఉన్నారు.

