Home Page SliderNational

అంగరంగ వైభవం అయోధ్యరామాలయం


పవిత్ర అయోధ్య నగరంలోని శ్రీరామ మందిరం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయోధ్య రామమందిరం గొప్ప నిర్మాణానికి సాక్ష్యంగా నిలుస్తోంది. కోట్లాది మందికి గౌరవప్రదమైన చిహ్నంగా అయోధ్య నిలుస్తోంది. ఈ స్మారక ప్రాజెక్ట్‌లో ఎన్నో ఆకర్షణీయమైన కోణాలున్నాయి. రామాలయాన్ని భక్తి, సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక, చారిత్రక, నిర్మాణ సంబంధమైన కోణాలలో తెలుసుకోవడం ఎంతో సముచితం. ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఒక్కో విషయాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. అసలు పునాది వేసిన దగ్గర్నుంచి ఆలయానికి పవిత్రత చేకూర్చడానికి ఏం చేశారన్నది తెలుసుకోవడం ఎంతో సముచితం. అందుకు ఆలయ నిర్మాణం మొదలుపెట్టిన దగ్గర్నుంచి సంప్రోక్షణ జరిగే వరకు అన్ని అంశాలను మీకు అందిస్తున్నాం…

  1. పవిత్ర పునాది: రామమందిరం పునాది లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఝాన్సీ, బితూరి, యమునోత్రి, హల్దీఘాటి, చిత్తోర్‌గఢ్, గోల్డెన్ టెంపుల్ వంటి ప్రముఖ ప్రదేశాలతో సహా 2587 ప్రాంతాల నుండి పవిత్ర మట్టిని ఆలయ నిర్మాణంలో వినియోగించారు. ఆలయంలోని ప్రతి కణం పవిత్రతకు చిహ్నంగా చెప్పుకోవాలి. విభిన్న ప్రాంతాలను ఆధ్యాత్మిక రామమందిరం ఐక్యం చేస్తుంది.
  2. సోంపురాల వారసత్వం: రామమందిరం వైభవం వెనుక ఉన్న వాస్తుశిల్పులు ప్రపంచవ్యాప్తంగా 100 దేవాలయాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన సోంపురా కుటుంబానికి చెందినవారు. వారి సహకారంతోనే సోమనాథ్ ఆలయాన్ని విస్తరించారు. ప్రధాన వాస్తుశిల్పి, చంద్రకాంత్ సోంపురా, ఆయన కుమారులు ఆశిష్, నిఖిల్ మద్దతుతో, ఆలయ వాస్తుశిల్పంలో తరతరాల వారసత్వాన్ని అందించారు.
  3. నిర్మాణంలో ఇనుము వాడలేదు… ఉక్కు వాడలేదు: రామాలయ నిర్మాణంలో ఎక్కడా కూడా వీసమెత్తు ఇనుము గానీ, ఉక్కును గానీ ఉపయోగించలేదు. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన పద్ధతుల కారణంగా… సహస్రాబ్ది పాటు అంటే వెయ్యేళ్లపాటు ఆలయం భద్రంగా ఉంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెబుతున్నారు. సాంప్రదాయ నిర్మాణ పద్ధతుల నుండి పొందిన రాళ్లను, ఆలయం శాశ్వత కాలం బలం ఉండేలా నిర్మించారు.
  4. శ్రీరాముని ఇటుకలు: చరిత్రకు సమ్మతిగా, రామమందిరాన్ని నిర్మించడంలో ఉపయోగించిన ఇటుకలపై ‘శ్రీరామ్’ అనే పవిత్ర శాసనాన్ని లిఖించారు. ఇది రామసేతు నిర్మాణ సమయంలో ఒక పురాతన ఆచారాన్ని ప్రతిధ్వనిస్తుంది. ఇక్కడ ‘శ్రీరాముడు’ అనే పేరు గల రాళ్ళు నీటిపై తేలికగా తేలియాడేవి. ఈ ఇటుకలు… ఆధునిక కాలంలోనూ రాముని ప్రాశ్యస్త్యాన్ని, ఔన్యత్యాన్ని నేటి మానవులకు వివరించేందుకు వీలు కలిగిస్తుందన్న విశ్వాసంతో నిర్మాణంలో ఇలా చేశారు.


ఇక ఆలయ నిర్మాణానికి సంబంధించి శిల్ప సంపదను ఆలయ నిర్వాహకులు సేకరించారు. రాముడి జీవితం మొత్తం ఆలయాన్ని వీక్షించడం ద్వారా తెలసుకునేలా నిర్మాణం జరిపించారు. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులను అయోధ్యకు రప్పించారు. ఆలయాన్ని 2.7 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా తీర్చిదిద్దారు.

  1. శాస్త్రాలు-చాళుక్య శైలి ఏకీకరణ: రామమందిరం నిర్మాణ బ్లూప్రింట్ వాస్తు శాస్త్రం, శిల్ప శాస్త్రాల సూత్రాలకు కట్టుబడి ఉంది. ఉత్తర భారత ఆలయ నిర్మాణ శైలిలో గుజరా-చౌళుక్య శైలిలో రూపొందించారు. ఈ ఆలయం పురాతన జ్ఞానం, సౌందర్య హోయలతో సామరస్య సమ్మేళనాన్ని ప్రతిధ్వనింపజేస్తోంది.
  2. థాయిలాండ్ నుండి నేల: విశ్వమంతా హిందుత్వమన్న భావనకు సూచకగా, జనవరి 22, 2024న రామ్ లల్లా పవిత్రోత్సవం, సంప్రోక్షణ కోసం థాయ్‌లాండ్ నుండి మట్టిని తెచ్చారు. ఈ మార్పిడి భౌగోళిక సరిహద్దులను దాటి రాముడి వారసత్వం విశ్వవ్యాప్తమన్న సందేశాన్నిస్తుంది.
  3. రాముడి దర్బార్: రామమందిరం నిర్మాణం 2.7 ఎకరాల విస్తీర్ణంలో మూడు అంతస్తులలో జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ రాముడి జీవితాన్ని వర్ణిస్తుంది, జననం, బాల్యం ఉంటుంది. మొదటి అంతస్తు ఎక్కేటప్పుడు, సందర్శకులు రాముని దర్బార్ వైభవాన్ని కనులారా చూడొచ్చు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ నుండి తెచ్చిన గులాబీ రంగు చలువరాయితో తయారు చేశారు.
  4. రామమందిర నిర్మాణం కొలతలు: రామమందిరం సంఖ్య కొలతలను పరిశీలిస్తే, ఇది 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పుతో నిర్మించారు. శిఖరంతో సహా మొత్తం ఎత్తు 161 అడుగుల ఉంటుంది. మూడు అంతస్తులు, మొత్తం 12 ద్వారాలతో, ఈ ఆలయం నిర్మాణ వైభవానికి చిహ్నంగా నిలుస్తుంది.
  5. పవిత్ర నదీ జలాలు: భారతదేశం అంతటా 150 నదుల నుండి పవిత్ర జలాలను తీసుకొచ్చి, ఆగస్టు 5న పవిత్రోత్సవం నిర్వహించారు. ఈ పవిత్ర సమ్మేళనం రామాలయ నిర్మాణం సుభిక్షం చేసింది. వివిధ నదులు, ప్రదేశాల నుండి తెచ్చిన జలాలు పవిత్రకు చిహ్నంగా నిలుస్తున్నాయి. ఇది ఆధ్యాత్మిక ఐక్యతను సూచిస్తుంది. ఇది భారతదేశం పవిత్రతను, సమగ్రతను ప్రతిబింబిస్తోంది.


ఆలయ నిర్మాణానికి దేశ వ్యాప్తంగా ఎందరో భూరి విరాళాలు సమర్పించారు. వారిలో యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి దగ్గర్నుంచి సామాన్యుడి వరకు ఎందరో ఉన్నారు. రామమందిర నిర్మాణం కోసం దేశం నలువైపుల నుంచి ట్రస్ట్ కు విరాళాలు అందాయి.

  1. ఆలయం కోసం విరాళాలు: రామమందిర నిర్మాణానికి వివిధ వర్గాల నుండి గణనీయమైన ఆర్థిక మద్దతు లభించింది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి నుంచి… ఆధ్యాత్మికవేత్తలు, దేశ ప్రజలు ఎందరో పెద్ద మొత్తాల్లో భూరి విరాళాలు అంచారు.
  2. ఆలయ చరిత్ర వివరించే టైమ్ క్యాప్సూల్: ఆలయ నిర్మాణానికి సంబంధించిన వివరాల కోసం టైమ్ క్యాప్సూల్‌ ఏర్పాటు చేశారు. ఆలయం కింద భూమికి 2000 అడుగుల దిగువన రాముడు, అయోధ్య గురించిన సమాచారాన్ని రాగి పలకతో రాశారు. భవిష్యత్ తరాలకు ఆలయ గుర్తింపును కాపాడే దార్శనిక ప్రయత్నం ఇది.
  3. పౌరాణిక దేవాలయంపై పరిష్కారం కాని సర్వే: ఆశ్చర్యకరంగా, పురావస్తు సర్వేలు బాబ్రీ మసీదు ముందుగా ఉన్న నిర్మాణంపై నిర్మించబడిందని సూచిస్తున్నాయి. కొన్ని సర్వేలు ఈ నిర్మాణాన్ని రాముడి యుగానికి చెందినవని పేర్కొంటుండగా, భారతీయ చరిత్రకారుడు సర్వేపల్లి గోపాల్‌తో సహా మరికొందరు అయోధ్య మానవ నాగరికత కేవలం 2800 సంవత్సరాల క్రితం నాటిదంటున్నారు. ఐతే, పురాతన, పురావస్తు శాస్త్రం కలయిక అయోధ్యకు సంబంధించి భిన్నకథనాలను అందిస్తోంది.
  4. అద్భుత నిర్మాణాలు, నగర్ స్టైల్ డిజైన్: ఆలయ రూపకల్పనలో నాగర్ శైలిలో రూపొందించారు. 360 స్తంభాలు ఆలయాన్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. బన్సీ పహర్‌పూర్, నగర్ శైలిని ఉపయోగించడం వల్ల నిర్మాణానికి ప్రత్యేకంగా దర్శనమిస్తాయి. రామాలయం ప్రార్థనాస్థలం అన్న భావన కాకుండా నిర్మాణ నైపుణ్యం, అద్భుతమైన కళాఖండంగా చిరస్మరణీయంగా గుర్తింపు పొందుతుంది.
  5. అయోధ్య రూపురేఖలు మార్చిన సందర్భం: రామమందిర నిర్మాణం మొత్తం అయోధ్య పట్టణాన్ని పునరుద్ధరించడానికి విస్తృత చొరవకు కారణమయ్యింది. మౌలిక సదుపాయాలు, సౌకర్యాలతో సహా 500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులతో, అయోధ్యను అభివృద్ధి చెందుతున్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని ప్రధాని మోదీ నిర్దేశించారు.
  6. విజన్ ఫర్ ది ఫ్యూచర్: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షణ ఏజెన్సీ ప్రకారం, ఆలయాన్ని జనవరి 22, 2024 నుంచి భక్తులకు అనుమతిస్తుంది. అయోధ్య రామమందిరం గతానికి సాక్ష్యంగా కాకుండా భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఆకాంక్షలకు మార్గదర్శకంగా నిలుస్తుంది.
  7. అయోధ్య: సంప్రోక్షణకు 84 సెకన్ల ముహూర్తం: అయోధ్యలో రామ్ లల్లా సింహాసనం సిద్ధమైంది. జనవరి 22న మధ్యాహ్నం దాటిన తర్వాత రాముడు సింహాసనాన్ని అధిరోహిస్తాడు. వేడుకను పూర్తి చేయడానికి అర్చకులకు 84 సెకన్ల సమయాన్ని నిర్దేశించారు. మృగశిర నక్షత్రంలో అభిజీత్ ముహూర్తంలో ఉదయం 11.51 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.33 గంటలకు ముగుస్తుంది. కాశీలో వేద ఆచార్యులచే సమయం నిర్ణయించబడింది. రామ్ లల్లా నిజమైన ప్రాణ ప్రతిష్ఠ మధ్యాహ్నం 12.29.08 – 12.30.32 మధ్య అంటే కేవలం 84 సెకన్ల పాటు జరుగుతుంది. ముహూర్తంలోని 16 లక్షణాలలో 10 మంచివి కాబట్టి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఈ స్వల్ప కాల వ్యవధిని ఎంచుకున్నారు.


అయోధ్య రామమందిరం ఒక నిర్మాణ ప్రాజెక్టు కంటే విశ్వాసం, చరిత్ర, వాస్తుశిల్పం సంగమానికి సజీవ స్వరూపంగా చెప్పుకోవాలి. రామాలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో… దేశమంతటా రామజపాన్ని అందుకొంది. అయోధ్య నుంచి అక్షింతలు దేశమంతటా చేరడం నిజంగా అసాధారణ ఘట్టమని చెప్పుకోవాలి. తరతరాల రాముని ఆదర్శాలను నేటి తరానికి అందిస్తోన్న నిర్వాహకులకు, వేద పండితులకు, సంతులకు వేల వేల వందనాలు. అయోధ్యలోని ప్రతి ఇటుక, శాసనం ఆధ్యాత్మిక వారసత్వం, సాంస్కృతిక సంపద హిందుత్వ భావనకు సజీవ తార్కాణం.