Andhra PradeshHome Page Slider

వివేకా హత్య కేసులో సున్నాను వంద.. వందను సున్నా చేస్తున్నారన్న అవినాష్ రెడ్డి

వివేకా హత్య విషయంలో విచారణ జరుగుతున్న సమయంలో… మీడియా ట్రయల్స్ వేస్తున్నారని విమర్శించారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. దోషులెవరో, నిర్ధోషులెవరో మీడియా నిర్ణయించేస్తోందని మండిపడ్డారు. ఒక అబద్ధాన్ని సున్నా నుంచి వందకు పెంచుతున్నారన్నారు. ఒక నిజాన్ని వంద నుంచి సున్నాకు తీసుకొస్తున్నారన్నారు. నిజమైన వాస్తవాలు బయటకు రావాలంటే మీడియా బాధ్యతతో మెలగాలన్నారు. ఎటో వెళ్లిపోయానని తప్పుడు వార్తలిస్తున్నారని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మళ్లీ విచారణకు రావాలా, లేదా అన్నది సీబీఐ చెప్పలేదన్నారు. ఫ్యాక్ట్స్ కంటే పర్సన్ టార్గెట్‌గా విచారణ జరుగుతుందన్నారు. తెలిసిన విషయాలన్నింటిపైనా విచారణ జరపాలని సీబీఐని కోరానన్నారు. మీడియాలో వస్తున్నట్టుగా ఆ రోజు నేను మాట్లాడినట్టు చెబుతున్నది… గూగుల్ టేకౌటా, టీడీపీ టేకౌటా అన్నది కాలమే నిర్ణయిస్తుందన్నారు. టీడీపీ ఏడాది క్రితం చేసిన విమర్శను సీబీఐ కౌంటర్లో వేస్తుందంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. తప్పుడు వార్తలు కాకుండా నిజాలను చూపించాలన్నారు. వివేకా చనిపోయిన రోజు మార్చురీ దగ్గర ఏం మాట్లాడోనే.. ఈ రోజూ కూడా అదే మాట్లాడుతున్నానన్నారు అవినాష్. విచారణ సందర్భంగా సీబీఐకి కూడా అదే చెప్పానన్నారు. వివేక చనిపోయిన రోజు చెప్పిందే.. మళ్లీ మళ్లీ చెబుతున్నాన్నారు. ఎప్పుడు అడిగినా అదే చెప్తానన్నారు. సాక్షిగా విచారించారా, దోషిగా అన్నది తెలియదన్నారు. విచారణ రైట్ డైరెక్షన్‌లో జరగాలన్నారు. సీబీఐ విచారణకు హాజరైన తర్వాత కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బాధ్యతగా వార్తలు ప్రసారం చేయాల్సిందిగా మీడియాకు అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నాలుగున్నర గంటల పాటు అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది.