అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు
వైఎస్ వివేకానందారెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డికి తెలంగాణా హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. ఒకవేళ సీబీఐ అనినాష్‌రెడ్డిని అరెస్టు చేసినట్లయితే రూ.5 లక్షల పూచీకత్తుతో బెయిల్‍పై విడుదలకు సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని అవినాష్‍కు షరతు పెట్టింది .సాక్షులను ప్రభావితం చేయవద్దని అవినాష్‍కు హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని అవినాష్‍కు హైకోర్టు ఆదేశం తెలిపింది.ప్రతి శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సీబీఐ ఎదుట హాజరుకావాలని వెల్లడించింది. సీబీఐకి అవసరమైనప్పుడు అవినాష్ రెడ్డి విచారణకు హాజరుకావాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కాగా ఈ షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చుని తెలంగాణా హైకోర్టు పేర్కొంది.

