Andhra PradeshHome Page SliderNews

ఏపీలో చిన్నారిపై ఘోరం

ఏపీలో తరచుగా మహిళలపై, చిన్నారులపై అకృత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. అనకాపల్లికి చెందిన దంపతులు తమ మూడేళ్ల కుమార్తెతో కలిసి, గంట్యాడలోని గ్రామానికి ఫంక్షన్‌కు వెళ్లారు. అక్కడి స్థానికుడైన రవి అనే యువకుడు ఆ చిన్నారిని తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. గమనించిన స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని మంత్రి సంధ్యారాణి పరామర్శించారు. నిందితుడు రవికి బెయిల్ కోసం ప్రయత్నించవద్దని లాయర్లకు  విజ్ఞప్తి చేశారు.