Andhra PradeshNews

జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆస్తులు ఈడీ అటాచ్‌

బస్సుల కొనుగోలు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన అనుచరుడు గోపాల్‌ రెడ్డి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసింది. దివాకర్‌ రోడ్‌లైన్స్‌, జఠాదర ఇండస్ట్రీస్‌, సి.గోపాల్‌ రెడ్డి అండ్‌ కో కంపెనీకి చెందిన రూ.22.10 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ఈడీ బుధవారం ప్రకటించింది. అశోక్‌ లేలాండ్‌ నుంచి తక్కువ ధరకు వాహనాలు కొన్నారని.. స్క్రాప్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ నెంబర్లతో కొత్త వాహనాలు నడిపినట్లు గుర్తించింది. తప్పుడు ధ్రువపత్రాలతో నాగాలాండ్‌, కర్ణాటక, ఏపీలో వాహనాల రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు ఈడీ దృష్టికి వచ్చింది. జీఎస్‌ 4 వాహనాల రిజిస్ట్రేషన్‌లోనూ రూ.38.36 కోట్ల కుంభకోణం జరిగిందని పేర్కొన్నది. దీంతో రూ.6.31 కోట్ల నగదు, ఆభరణాలు, బ్యాంక్‌ డిపాజిట్లతో పాటు రూ.15.79 కోట్ల విలువైన 68 చరాస్తులను సీజ్ చేశారు.