Home Page SliderNational

ప్రభాస్‌పై చేసిన కామెంట్స్‌తో పాపులర్‌ ఐన అర్షద్‌

క‌ల్కి 2898 ఏడీ చిత్రంలో ప్ర‌భాస్ యాక్టింగ్‌పై వివాదాస్పదంగా మాట్లాడి టాక్‌ ఆఫ్‌ ది సోషల్ మీడియాగా మారిపోయాడు బాలీవుడ్ యాక్టర్ అర్షద్‌ వర్షి. తనకు కల్కిలో ప్ర‌భాస్‌ను చూస్తున్న‌ప్పుడు జాలేసిందని అమితాబ్ ముందు అత‌డు ఒక జోక‌ర్ లాగా క‌నిపించాడని అర్షద్ వర్షి కామెంట్ చేయడంతో నెట్టింట ట్రోల్స్‌ మొదలయ్యాయి. గ్లోబల్‌ స్టార్‌ యాక్టర్‌ ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి 2898 ఏడీ గ్లోబల్ బాక్సాఫీస్‌ వద్ద ఏ రేంజ్‌లో వసూళ్లు రాబట్టిందో మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ కామెంట్స్‌పై టాలీవుడ్ యాక్టర్ సుధీర్‌బాబు స్పందిస్తూ.. ఇలాంటి సంకుచిత ధోరణి కలిగిన వ్యక్తుల వ్యాఖ్యల కంటే ప్రభాస్‌కున్న స్థాయి చాలా ముఖ్యమైనదని అర్షద్‌ వర్షిపై తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. కాగా ఇప్పుడు సరిపోదా శనివారం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో న్యాచురల్ స్టార్ నాని కూడా ఈ కామెంట్స్‌పై స్పందించాడు. అర్షద్‌ వర్షి తన సినిమా కెరీర్‌ మొత్తంలో అందుకోలేని పాపులారిటీ ఒక్క ప్రభాస్‌పై చేసిన లేనిపోని మాటలతో పొందాడని అన్నారు నాని. ఓ యూట్యూబర్‌ చేసిన చిట్‌చాట్‌లో అర్షద్‌ వర్షి మాట్లాడుతూ.. క‌ల్కి సినిమా త‌న‌కు న‌చ్చ‌లేదని.. అమితాబ్ బ‌చ్చ‌న్ పాత్ర అస‌లే అర్థం కాలేదని.. ఈ వ‌య‌సులో క‌ల్కి లాంటి సినిమాలు ఎలా చేస్తున్నారని అన్నాడు. అంతేకాకుండా బిగ్‌బీకున్న ఫాలోయింగ్‌లో తనకు ఏ కొంచెం ఉన్నా మొత్తం లైఫ్ సెట్ అయిపోతుందని.. అతడు అసాధారణమైన వ్యక్తి అని అన్నాడు.