ప్రపంచ సుందరీమణుల రాక.. వరంగల్‌లో హైటెన్షన్..!
ప్రపంచ సుందరీమణుల రాకతో వరంగల్‌లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మిస్ వరల్డ్ పోటీదారులు వచ్చే ప్రధాన రహదారుల్లో చిరు వ్యాపారుల షాపులను జీడబ్ల్యూఎంసీ అధికారులు తొలగించారు. హన్మకొండ నుంచి కాజీపేట వరకు రోడ్డుకు ఇరువైపులా స్ట్రీట్ జోన్స్ ను తొలగించారు. జీడబ్ల్యూఎంసీ తీరుతో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనకు బీఆర్ఎస్ నేతలు దాస్యం వినయ్ భాస్కర్, రాజయ్య పిలుపునిచ్చారు.

