అర్జెంటీనా ఉపాధ్యక్షురాలిపై హత్యాయత్నం
అర్జెంటీనా ఉపాధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ క్రిస్టినా పై హత్యాయత్నం జరిగింది. ఫెర్నాండెజ్ ఇంటి ముందు వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో ఈ ఘటన జరిగింది. ఓ ఆగంతకుడు అతి దగ్గరి నుంచి తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించాడు. ట్రిగ్గర్ నొక్కినా పేలకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానిక టెలివిజన్ ఫుటేజ్‌ను అక్కడి అధికారులు విడుదల చేశారు. ఈ సంఘటనలో ఉపరాష్ట్రపతి సురక్షితంగా ఉన్నట్లు వారు తెలిపారు. కాల్పులు జరిపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిస్టినా 2007-2015 వరకు అర్జెంటీనా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె హయాంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కొందరు ఆందోళనకారు నిరసన తెలుతున్నారు. నిందితుడు వారి మధ్యలో నుంచి వచ్చి కాల్చేందుకు ప్రయత్నించాడు . కాగా వచ్చే ఎన్నికల్లో ఆమె దేశాధ్యక్షురాలిగా పోటీ చేసే అవకాశం ఉంది.

