Home Page SliderNational

మీ పిల్లల వయసు 18 ఏళ్ల లోపేనా..? అయితే ఈ వార్త మీ కోసమే..

కేంద్ర ప్రభుత్వం పిల్లల కోసం కొత్త స్కీం ను ప్రారంభించింది. పిల్లల రిటైర్ మెంట్ కోసం తల్లిదండ్రులు ఇన్వెస్ట్ చేయడానికి కొత్త స్కీం ఎన్ పి ఎస్ వాత్సల్యను భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఏడాదికి కనిష్టంగా రూ. 1000/-, గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్, ఈ-ఎన్ పి ఎస్ ప్లాట్ ఫాంలో ఈ స్కీము కింద అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ ఏడాది బడ్జెట్ లో ఎన్ పి ఎస్ వాత్సల్య స్కీమ్ ను ప్రభుత్వం ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సెస్ బ్యాంక్, మరికొన్ని బ్యాంకులు ఎన్ పి ఎస్ వాత్సల్య స్కీమ్ ను ప్రారంభించాయి. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఈ స్కీమ్ ను ఓపెన్ చేయొచ్చు. పిల్లల వయసు 18 ఏళ్ల దాటిన తర్వాత ఎన్ పి ఎస్ వాత్సల్య అకౌంట్ సాధారణ ఎన్ పి ఎస్ అకౌంట్ గా మారిపోతుంది. 18ఏళ్ల లోపు ఉన్నవారి కోసమే అకౌంట్ ఓపెన్ చేయడానికి వీలుంటుంది. పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ ఇండియన్ సిటిజెన్స్ అయి ఉండాలని షరతు విధించింది.