Andhra PradeshNews

వైఎస్సార్ కాపు నేస్తం నిధులు నేడే విడుదల

Share with

ఏపీలో అర్హులైన కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3లక్షల 38 వేల మంది మహిళలకు 508 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పంపిణీ చేయనున్నారు. బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న ఏటా 15 వేల చొప్పున ఇస్తామని జగన్ ఇచ్చిన హామీని మూడో యేడు నిలబెట్టుకుంటున్నారు. మూడేళ్లలో ఇప్పటి వరకు సుమారుగా 1500 కోట్ల నిధులని కాపు మహిళలకు అందించినట్టవుతుంది. ఒక్కొక్క పేద కాపు మహిళకు ఐదేళ్లలో 75 వేల రూపాయలు పంపిణీ చేస్తామని గతంలో జగన్ చెప్పారు. టీడీపీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుంటే తాము అధికారంలోకి వచ్చాక కాపులకు అండగా నిలిచామని సీఎం జగన్ పదేపదే చెబుతూ వస్తున్నారు.