Andhra PradeshHome Page Slider

ఏపీ సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెలగపూడిలోని సచివాలయానికి చేరుకున్నారు. కాగా ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు,పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనపై దారిపొడువునా పూల వర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. అయితే ఆయన రేపు మంత్రిగా సచివాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఇవాళ తన ఛాంబర్‌ను పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ సచివాలయంలో అడుగుపెట్టారు.