ఏపీకి జగన్ మళ్లీ సీఎం కావడం చాలా అవసరం:జోగి రమేష్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ..ఈసారి ఎన్నికల్లో సీఎం జగన్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే బరిలోకి దిగుతానన్నారు. కాగా పార్టీ నాయకుడు తీసుకునే నిర్ణయానికి ఎమ్మెల్యేలంతా కట్టుబడి ఉండాలని అన్నారు. ఈ మేరకు తనకు ఈసారి పెడన సీటు ఇవ్వకపోయిన పర్వాలేదన్నారు. సీఎం జగన్ మైలవరం లేదా ఎక్కడికి వెళ్లమంటే అక్కడకు వెళ్తానని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ ఇటీవల పార్టీలో చేపట్టిన మార్పులు వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీనే అధికారంలోకి రావడానికి తీసుకుంటున్న ముందస్తు చర్యలు అన్నారు. ఈ మేరకు ఈసారి ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం కావడం ఏపీ రాష్ట్రానికి కూడా చాలా అవసరం అన్నారు. అయితే ఈ క్రమంలో ఆయన పార్టీ నేతలెవరిని వదులుకోరని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. అయితే నిన్న మంత్రి రోజా కూడా పార్టీ టికెట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పుటికీ జగన్‌తో నే ఉంటానన్నారు. కాగా సీఎం జగన్ కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమేనని మంత్రి రోజా వెల్లడించారు.


 
							 
							