ఏపి శాసన మండలి రసాభాసా
ఏపిలో సోషల్ మీడియా కేసులు,అరెస్ట్‌లపై వైసీపి శాసన మండలి సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించడంతో సభలో గందరగోళం ఏర్పడింది.వైసీపి సోషల్ మీడియా కి చెందిన వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారని దీనిపై సభలో చర్చ జరగాలని వైసీపి సభ్యులు పట్టుబట్టి వాయిదా తీర్మానం ఇచ్చారు.అంతే కాదు …డీఎస్సీపై వాయిదా తీర్మానాన్ని కూడా స్పీకర్ కి ఇచ్చారు.అయితే ఈ రెండు అంశాలను ఛైర్మన్ తోసిపుచ్చడంతో వైసీపి ప్రజాప్రతినిధులు పోడియం దగ్గరకొచ్చి నిరశన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి,ఛైర్మన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దీంతో ఇరు పక్షాల మథ్య వాదోపవదనలు తీవ్ర స్థాయిలో జరిగాయి.

