ఐఏఎస్ అధికారులపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులో ఐఏఎస్ అధికారులపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, ఎస్ ఎస్ రావత్, దినేష్ కుమార్ హైకోర్టుకు హాజరయ్యారు. ఇందులో ద్వివేది, రావత్ 70 కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయస్థానానికి రావడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇన్ని కేసులు నమోదవుతుంటే కోర్టు ఉత్తర్వులు అంటే… లెక్కలేని తనం ఎందుకని న్యాయస్థానం ప్రశ్నించింది. ఏమవుతుంది లే అనే బరితెగింపు వైఖరి ప్రదర్శిస్తే ఊరుకుంటామనే భ్రమల్లో ఉండొద్దని అధికారులను కోర్టు హెచ్చరించింది. తరచూ మిమ్మల్ని చూడటానికి న్యాయస్థానానికి చికాకు వేస్తోందని దేశంలో కోర్టు ధిక్కరణ కేసులు ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయని హైకోర్టు కామెంట్ చేసింది.

