మహానేతకు సీయం జగన్ ఘననివాళి
ఈరోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి జగన్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. తనకు ప్రతి అడుగులో తన తండ్రే స్ఫూర్తి అంటూ జగన్ భావోద్వేగ ట్వీట్ చేశారు. “ నాన్న భౌతికంగా దూరమైనా ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశ చరిత్రలోనే సంక్షేమాన్ని కొత్తగా నిర్వచించారు”. అని జగన్ ట్వీట్ చేశారు. తండ్రి సమాధి వద్ద జగన్, షర్మిల కంటతడి పెట్టారు.

కాగా మహానేత రాజన్నకు కాంగ్రెస్ నేతలు కూడా నివాళులు అర్పించారు. వారిలో సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటూ “అన్నలా మీరిచ్చిన భరోసా.. వెంకన్నా అనే పిలుపులోని ఆప్యాయతను ఎప్పటికీ మరిచిపోను.” అంటూ ట్వీట్ చేశారు.

