భారత వైమానిక రంగంలో మరో అస్త్రం-సుదర్శన్ ఎస్ 400 విజయవంతం
భారత వైమానిక రంగంలో మరో పవర్ ఫుల్ అస్త్రం చేరింది. రష్యాతో కలిసి భారత్ రూపొందించిన సుదర్శన్ ఎస్-400 క్షిపణిని వ్యవస్థను భారత్ వైమానిక దళం విజయవంతంగా పరీక్షించింది. ఇది గత క్షిపణుల కంటే 80 శాతం ఎక్కువ శక్తివంతమైనది. శత్రు విమానాలను అధిక రేటుతో నాశనం చేసినట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ మిస్సైల్ విమానాలను కదలకుండా చేసి, అటాక్ చేయగలదని వివరించారు. దీనితో భారత వైమానిక దళం మరింత బలపడింది. ఇప్పటికే మూడు స్క్వాడ్రన్‌లు డెలివరీ కాగా, 2026 నాటికి మరో రెండు స్క్వాడ్రన్‌లు సిద్ధం అవుతాయి.

